దేశ భాషలందు తెలుగు లెస్స
బ్రాహ్మణుల భోజనంలో "పంది, చేప, కప్పు, కోడి పెట్టి తీరాలి అన్నాడో తుంటరి"... అవధాని గారితో..... అంతా నిర్ఘాంత పోయారు.
ఓస్ అదెంత పని అన్నారు అవధాని గారు !!
"అందమైనట్టి 'పంది'రింట బ్రాహ్మణుల ఇం 'చేపట్టిన పరిణయమున కొసరి మా 'కప్ప'డాలు ప'కోడి' పెట్ట కమ్మనౌ వంటకాలతో కడుపు నిండె !!
భోంచేశారుగా కమ్మని తెలుగు భాష వంటని!
అందుకే అన్నాడేమో తుళుసత్కుల వంశుడు ఆ కృష్ణరాయుడు, అఖిలాంధ్ర తపః ఫలజాతమూర్తి శ్రీకృష్ణదేవరాయలు". "దేశ భాషలందు తెలుగు లెస్స" అని.
Comments
Post a Comment